శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు!..నిపుణుల కమిటీ వార్నింగ్..

- April 21, 2022 , by Maagulf
శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు!..నిపుణుల కమిటీ వార్నింగ్..

శ్రీశైలం: ఏపీకి ప్రధాన జలవనరయిన శ్రీశైలం డ్యాం ప్రమాదకర స్థితిలో ఉందా? కృష్ణమ్మను తనలో నింపుకుని, విద్యుత్ ఉత్పాదన చేస్తూ తెలుగు ప్రజలకు నీరు, వెలుగు ఇస్తున్న శ్రీశైలానికి ప్రమాదం పొంచి ఉందా?

డ్యామ్‌కు తక్షణమే మరమ్మత్తులు చేపట్టకపోతే విధ్వంసం తప్పదా..? పదే పదే గేట్లు ఎత్తాల్సిరావడం డ్యామ్ భద్రతకు ముప్పు కలిగిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ పాండ్యా నిపుణుల కమిటీ అవుననే సమాధానమిస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరద మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని.. లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని పాండ్యా కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో స్పిల్‌వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం.., కుడి, ఎడమవైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడాన్ని పరిశీలించాలని సూచించింది. ప్లంజ్‌పూల్‌ సహా డ్యాం, స్పిల్‌వేకి మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని సిఫారసు చేసింది.

ప్రస్తుత స్పిల్‌వే సామర్థ్యానికి తగినట్లు లేదని తెలిపిన కమిటీ.. ప్లంజ్‌పూల్‌, స్పిల్‌వేకు సంబంధించిన మరమ్మతులు చేపట్టాలని సూచించింది. మరోవైపు పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. డ్యాం నిర్వహణపై గతంలో కమిటీల సిఫార్సులు, సీడబ్ల్యూసీ పరిశీలనలో తేలిన అంశాలపై ఇప్పుడు తాజాగా తుది నివేదిక ఇచ్చిన పాండ్యా కమిటీ.. డ్యాం భద్రతకు చర్యలు ప్రారంభించే ముందు పీఎంఎఫ్‌పై మరోసారి అధ్యయనం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com