ఈద్ అల్ ఫితర్ 2022 సెలవుల ప్రకటన
- April 22, 2022
యూఏఈ: ఈద్ అల్ ఫితర్‌కు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం.ఈ మేరకు గురువారం ఆ దేశ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.దీంతో ఏప్రిల్ 30(శనివారం) నుంచి మే 6(శుక్రవారం) వరకు వారం రోజులు సెలవులు ఉండనున్నాయి. దేశంలోని అన్ని మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని కేబినెట్ స్పష్టం చేసింది.మళ్లీ మే 9న(సోమవారం) కార్యాలయాలు తెరచుకుంటాయని, అప్పుడు యధావిధిగా విధులకు హాజరు కావాలని ఉద్యోగులను సూచించింది.మధ్యలో మే 7(శనివారం), మే 8(ఆదివారం) రెండు రోజులు అదనంగా సెలవులు కలిసిరావడంతో మొత్తంగా 9 రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి వద్దే ఉండనున్నారు.ఈ తొమ్మిది రోజులు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు మూతపడనున్నాయి.
యూఏఈ తాజా నిర్ణయంతో అటు షార్జా కూడా రమదాన్ సెలవులను పొడిగించింది.ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు హాలీడేస్ ఇచ్చింది.ఇక యూఏఈలోని మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వశాఖ.. ప్రైవేట్ సెక్టార్‌కు ఐదు రోజుల సెలవులు ప్రకటించింది.శనివారం (ఏప్రిల్ 30), ఆదివారం (మే 1), సోమవారం (మే 2), మంగళవారం(మే 3), బుధవారం (మే 4) వరుసగా ఐదు రోజులు సెలవులిచ్చింది.అయితే, ఇది చంద్రవంక కనిపించే దానిపై ఆధారపడి ఉంటుందని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (EAS) పేర్కొంది. (EAS) అంచనా ప్రకారం రమదాన్ పండుగ మే 2న ఉండనుంది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







