తబుక్ పర్వతాల్లో చిక్కుకున్న యువకుడిని రక్షించిన సివిల్ డిఫెన్స్
- April 22, 2022
సౌదీ: తబుక్-వాయువ్య సౌదీ అరేబియాలోని అబు రాకా సెంటర్లో రెండు రాతి కొండల మధ్య ఇరుకైన ప్రాంతంలో చిక్కుకున్న యువకుడిని పౌర రక్షణ దళాల రెస్క్యూ మిషన్ సిబ్బంది రక్షించాయి.తీవ్రంగా గాయపడ్డ సదరు వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా అబు రాకా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉంది.ఆ వ్యక్తి పర్వత పగుళ్లలో పడిన బాధాకరమైన క్షణాన్ని డాక్యుమెంట్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సివిల్ డిఫెన్స్ రెస్క్యూ టీమ్‌లు అతనిని రక్షించేందుకు అనేక గంటలపాటు నిరంతరం శ్రమించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి యువకుడు నిలబడి ఉన్న స్థితిలో ఇరుకైన సందులో ఇరుక్కుపోయాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దాదాపు 30 గంటల పాటు పలు భద్రతా బృందాలు సహాయక చర్యలను కొనసాగించాయి.యువకుడిని రక్షించడంలో రెడ్ క్రెసెంట్ అథారిటీ, అబు రాకా మునిసిపాలిటీ యూనిట్లతోపాటు సివిల్ డిఫెన్స్ కు వాలంటీర్లు తమ వంతు సహాయం అందించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







