‘ఆచార్య ‘ ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి
- April 24, 2022
హైదరాబాద్: లెజండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో , అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం’ ఆచార్య’. బ్లాక్ బర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వవహిస్తున్నారు.. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. కాజల్ అగర్వాల్ , పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సందర్భంగా శనివారం రాత్రి యూసఫ్ గూడ లోని టి ఎస్పీ ఎస్పీ 1వ బెటాలియెన్ మైదానంలో అభిమానుల కోలాహలం మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడారు . ఇపుడు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేలా బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు నిరూపించాయని అన్నారు. ఇందుకు దర్శకుడు రాజమౌళి ఎంతైనా అభినంద నీయుడని అన్నారు.. రాజమౌళి మన తెలుగు వాడు కావటంమన అదృష్టమన్నాడు. భారతీయ సినిమా ఒక మఠం అయితే ఆ మఠానికి పీఠాధిపతి రాజమౌళి అని పేర్కొన్నారు..
అనంతరం రాజమౌళిని శాలువాతో ఘనంగా సత్కరించారు. చరణ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు . ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుందని అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, రాంచరణ్, పూజ హెగ్డే, రామజోగయ్య శాస్త్రి. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







