ఒమన్ లో 18 కొత్త పెట్టుబడి అవకాశాలు
- April 24, 2022
ఒమన్:పర్యాటకం, వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగాలలో పద్దెనిమిది కొత్త పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) ఆదివారం వెల్లడించనుంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లో జరిగే ఈ ఈవెంట్‌ను హెరిటేజ్, టూరిజం మంత్రి సలీం బిన్ మహ్మద్ అల్ మహ్రూఖీ స్పాన్సర్ చేయనున్నారు. ASAAS (మస్కట్ నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ), ఒమ్రాన్ (ఒమన్ టూరిజం డెవలప్‌మెంట్ కంపెనీ), ఒమన్ ఎన్విరాన్‌మెంటల్ సర్వీసెస్ హోల్డింగ్ కంపెనీలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, మార్కెట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలను నిర్వహించారు. ఆర్థిక పెట్టుబడుల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడం, పెట్టుబడిదారులకు సరైన వాతావరణాన్ని సృష్టించడం, ప్రైవేట్ రంగ పెట్టుబడులకు సాధికారత, ప్రోత్సాహం అందించడం, ఎఫ్‌డిఐని పెంచడానికి ఒమన్‌ను పెట్టుబడి గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెట్టుబడి అవకాశాలను ‘ఇన్వెస్ట్ ఇన్ ఒమన్’ వేదిక ద్వారా తెలిపే ఏర్పాట్లు చేశారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







