29న ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇఫ్తార్ విందు
- April 24, 2022
హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, హాజరవుతారని కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్న సీఎం.. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. అని కేసీఆర్ తెలిపారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







