ఎలక్ట్రిక్ వాహనాలు రీకాల్ చేసిన ఓలా
- April 24, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది.వాహనాల తయారీలో లోపాలుంటే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందంజలో ఉన్న కంపెనీల్లో ఓలా ఒకటి. అయితే, గత నెలలో ఓలా స్కూటర్లు, బ్యాటరీలు పేలిపోయిన సంఘటనలు వెలుగుచూశాయి.
ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు గల కారణాలను కనుగొనేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే విక్రయించిన 1,441 ఓలా స్కూటర్లను రీకాల్ చేసింది. సంస్థకు చెందిన ఇంజనీర్లు బ్యాటరీలు, వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే లోపాలను సరిదిద్దుతారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రమాణాలకు అనుగుణంగా తమ వాహనాలు ఉండేలా చూస్తామని ఓలా ప్రకటించింది. దేశంలో ఈమధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది.
వాహనాలు కాలిపోవడం లేదా బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు మరణిస్తున్నారు కూడా. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఒకినావా ఆటోటెక్ అనే సంస్థ తమ కంపెనీకి చెందిన 3,000కు పైగా వాహనాలను రీకాల్ చేసింది. వినియోగదారులు తమ వాహనాలను స్వచ్ఛందంగా అందించాలని కంపెనీలు కోరుతున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







