కళ్యాణ్ దిల్ రాజు సినిమా..
- April 05, 2016
ఒకప్పుడు వరుస సూపర్ హిట్ లతో మంచి ఫాంలో కనిపించి దిల్ రాజు ఇటీవల కాలం ఆ స్ధాయిలో సక్సెస్ లు సాధించలేకపోతున్నాడు. ఇటీవల దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలేవి ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, దిల్ రాజు మాత్రం తన రూట్ మార్చటం లేదు. గతంలో తన బ్యానర్ లో ఫెయిల్ అయిన దర్శకులకు కూడా మరో అవకాశం ఇచ్చిన దిల్ రాజు ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో చాలా కాలం తరువాత మంచి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరి. అయితే ఆ తరువాత రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేసిన సౌఖ్యం సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్న రవికుమార్ చౌదరికి మరో ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు.నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్, ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. వెంటనే దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్. మరి దిల్ రాజు సినిమాతో రవికుమార్ చౌదరి, కళ్యాణ్ రామ్ ల కెరీర్ లు గాడిలో పడతాయేమో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







