తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదల కానున్న 24 పాటలు
- April 05, 2016
చాలా రోజులుగా తెలుగు మార్కెట్ మీద పట్టు కోసం కష్టపడుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన కొత్త సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 24 సినిమాలో నటిస్తున్న సూర్య, ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్ట్రయిట్ తెలుగు సినిమాకు ప్రమోషన్, రిలీజ్ లను ఎలా ప్లాన్ చేస్తారో, అదే స్ధాయిలో కష్టపడుతున్నాడు. అఫీషియల్ టీజర్ రిలీజ్ విషయంలోనూ అలాగే వ్యవహరించాడు. తమిళ, తెలుగు ట్రైలర్ లను ఒకేసారి రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఆడియో రిలీజ్ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని భావిస్తున్నాడు.
ఈ నెల 11న 24 ఆడియోను గ్రాండ్గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఆ రోజు ఉదయం చెన్నైలో తమిళ వర్షన్ ఆడియోను రిలీజ్ చేసిన, వెంటనే సాయంత్రం హైదరబాద్ లో తెలుగు భాషలో ఆడియోను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు, కాలంలో ప్రయణించటం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్య తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే చివరి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!







