ఎక్స్‌ఛేంజీ కంపెనీ ఉద్యోగిపై అభియోగాల్ని కొట్టివేసిన న్యాయస్థానం

- April 26, 2022 , by Maagulf
ఎక్స్‌ఛేంజీ కంపెనీ ఉద్యోగిపై అభియోగాల్ని కొట్టివేసిన న్యాయస్థానం

మనామా: హై క్రిమినల్ కోర్టు, ఓ ఎక్స్‌ఛేంజీ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగిపై నిధుల మోసం కేసుకి సంబంధించిన అభియోగాల్ని కొట్టివేసింది. 8 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా పేర్కొనడం జరిగింది. 345 బహ్రెయినీ దినార్ల మోసం జరిగినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ నిందితుడి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది జుహైర్ అబ్దుల్ లతీఫ్, 2018 - 19 మధ్య జరిగిన ఈ కేసులో తన క్లయింట్ ఎలాంటి పొరపాటూ చేయలేదని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఆయన నిందితుడనడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో, న్యాయస్థానం అతనికి ఈ కేసు నుంచి విముక్తి కలిపించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com