జాబ్‌ వీసా రెన్యువల్‌ ఫీజు పెంపు ప్రతిపాదన

- April 05, 2016 , by Maagulf
జాబ్‌ వీసా రెన్యువల్‌ ఫీజు పెంపు ప్రతిపాదన

వీసా రుసుముల పెంపులో వలసదారుల కుటుంబాలు, హౌస్‌మెయిడ్‌ వీసా మరియు డ్రైవర్స్‌ను పొందుపరిచే ప్రతిపాదన ఏదీ వీసా రెన్యువల్‌ ఫీ ప్రపోజల్‌లో లేదని మజ్లిస్‌ అల్‌ సురా మెంబర్‌ చెప్పారు. జాబ్‌ వీసాలకు మాత్రమే రెన్యువల్‌ పీజు వర్తించేలా ప్రపోజల్‌ పెట్టబడిందని ఆయన వివరించారు అల్‌ ఉరా మెంబర్‌ తాఫిక్‌ అల్‌ లవాతి. జాబ్‌ వీసా రెన్యువల్‌ కోసం గ్రాస్‌ సేలరీలో మూడు శాతం లేదా, 300 ఒమన్‌ రియాల్స్‌ వసూలు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఇది ఇంతకు ముందు 200 ఒమన్‌ రియాల్స్‌గా ఉంది. అయితే ఈ ఆలోచన తమకు షాక్‌ కలిగిస్తోందని వలసదారులు అంటున్నారు. ఒమన్‌లో ప్రస్తుతం 1,990,294 మంది వలసదారులున్నారు. 200 ఒమన్‌ రియాల్స్‌ వీసా రెన్యువల్‌ ఫీజుని లెక్క కడితే, 398,058, 800 ఒమన్‌ రియాల్స్‌ అవుతుంది. ఈ నిర్ణయంతో చాలామంది ఒమన్‌ని విడిచి వెళ్లడానికే మొగ్గు చూపుతారని వలసదారుల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com