సిరియాలో రసాయన దాడి కి పాల్పడ్డ ఐఎస్

- April 05, 2016 , by Maagulf
సిరియాలో రసాయన దాడి కి పాల్పడ్డ ఐఎస్

ఐఎస్‌ ఉగ్రవాదులు ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా మస్టర్డ్‌ గ్యాస్‌ను ఉపయోగించినట్లు సిరియా అధికారిక మీడియా ఆరోపించింది. దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని డెయిర్‌ అల్‌జువర్‌ వైమానిక స్థావరాన్ని ఆక్రమించేందుకు ప్రభుత్వ దళాలపై జరిపిన దాడిలో దీనిని ఉపయోగించినట్లు సమాచారం. ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. దీంతో పాటు ఇరాక్‌, సిరియా దళాలను నాశనం చేసేందుకు ఐఎస్‌ క్రూడ్‌ నుంచి వచ్చే రసాయనాలతో బాంబులు తయారు చేసి వినియోగిస్తున్నట్లు సమాచారం.సోమవారం రాత్రి డెయిర్‌ అల్‌ జోవర్‌పై మస్టర్డ్‌ గ్యాస్‌ నింపిన రాకెట్లతో దాడి చేసినట్లు సిరియాకు చెందిన న్యూస్‌ ఏజన్సీ సనా పేర్కొంది.దీంతో కొంత మంది ప్రజలు వూపిరి ఆడక ఇబ్బంది పడినట్లు దీనిలో పేర్కొంది. అల్‌ జువర్‌ పట్టణంలో మొత్తం 2 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఇప్పటికే ఐఎస్‌ ముట్టడించింది. ఇక్కడ ప్రభుత్వానికి పట్టున్న ప్రాంతాల్లో యూఎన్‌ విమానాల ద్వారా అవసరమైన వస్తువులను జారవిడుస్తూ సహాయం చేస్తోంది. ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా పట్టుఉన్న చిట్టచివరి ప్రదేశం ఇక్కడి ఎయిర్‌ బేస్‌ మాత్రమే. గత నెలలో ఉత్తర ఇరాక్‌లో ఐఎస్‌ మస్టర్డ్‌ గ్యాస్‌ వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com