షూటింగ్‌లో హీరో గోపీచంద్‌కి ప్రమాదం..
- April 29, 2022
మైసూరు: హీరో గోపీచంద్ ఇటీవలే సీటిమార్ సినిమాతో చాలా రోజుల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ తన 30వ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.గోపీచంద్ కి లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ఇది రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతుంది.అయితే షూటింగ్ జరుగుతుండగా స్పాట్ లో హీరో గోపీచంద్ కాలు జారి కింద పడ్డారు.వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా కేవలం బెణికింది, ఎలాంటి ప్రమాదం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పినట్టు సమాచారం.ఈ ఘటనపై దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. గోపీచంద్ షూటింగ్ సమయంలో కాలు జారి కింద పడ్డారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







