యాదగిరిగుట్టలో ఘోరం..భవనం కూలి నలుగురు మృతి..
- April 29, 2022
తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రెండస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భవనం ఉన్నట్టుండి ఎలా కూలిపోయిందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది పురాతన భవనమా లేక నిర్మాణం సరిగ్గా చేపట్టని భవనమా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ భవనం పరిధిలో దుకాణ సముదాయాలు ఉండటంతో.. శిధిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఊహించని పరిణామాంతో స్థానికులు, బాధిత కుటుంబాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. పురాతన భవనం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. నీటి లీకేజీ కారణంగా బిల్డింగ్ నిర్మాణం బలహీనపడి ఈ ప్రమాదం జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మృతదేహాలను, గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు, అధికారులు.. ఘటనపై విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..







