మొటిమల్ని తొలగించుకోవడానికి ఇంట్లో పాటించే కొన్ని చిట్కాలు..
- April 05, 2016
ముఖంపై చిన్న మొటిమ కనిపిస్తే చాలు.. ఈ కాలం అమ్మాయిలు తెగ కంగారు పడిపోతుంటారు. తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి అమ్మాయిలకు ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు ఇవిగో.. దా ల్చిన చెక్క వంటకాలకు అదనపు రుచిని తేవడానికే కాదు.
.. మొటిమల్ని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని పొడిగా చేసి.. అందులో కొద్దిగా తేనె కలపాలి. ఈ మెత్తని మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాత్రి పూట రాయాలి. మర్నాడు కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.
* జాజికాయ చాలా వరకూ వంటింట్లో అందుబాటులో ఉంటుంది. దీన్ని పొడిలా చేసి.. అందులో తగినన్ని పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపటికి ఈ పూత పొడిగా అయ్యాక కడిగేయాలి. జాజికాయ, పాలలో ఉండే గుణాలు మొటిమలతో పోరాడతాయి.
* ఎండబెట్టిన కమలా తొక్కల పొడి మార్కెట్లో దొరుకుతుంది. ఈ పొడిని రెండు చెంచాలు తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, వేరుసెనగ నూనె చేర్చాలి. ఈ ముద్దని మొటిమల మీద రాయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల తగిన ఫలితం కనిపిస్తుంది.
* నిమ్మరసం మొటిమల్ని తొలగిస్తుందిగానీ నేరుగా వాడకపోవడం మంచిది. అందుకేం చేయాలంటే.. మరిగించిన పాలలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి.. అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపయ్యాక ఆ దూది ఉండల్ని మొటిమల మీద అద్దాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే సరి.
* గులాబీ నీళ్లూ, నిమ్మరసం సమపాళ్లలో కలిపి... ముఖానికి మర్దన చేసుకోవాలి. అరగంటయ్యాక టొమాటో గుజ్జు రాసి వదిలేయాలి. కాసేపటికి చల్లటి నీళ్లతో ముఖం తడిపి మునివేళ్లతో మర్దన చేయాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తుంటే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
* బంగాళాదుంపని మెత్తగా గుజ్జు చేసి మొటిమలున్న చోట రాయాలి. ఈ దుంప చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. మొటిమల్నీ దూరం చేస్తుంది. వాటితోపాటూ వేడి కురుపులూ, చెమట పొక్కులూ దూరమవుతాయి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







