భారతీయ సినిమాలను నిషేధించాలి :పాకిస్థాన్‌

- April 05, 2016 , by Maagulf
భారతీయ సినిమాలను నిషేధించాలి :పాకిస్థాన్‌

పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను ప్రదర్శించకుండా నిషేధించాలంటూ పాకిస్థానీ చలనచిత్ర నిర్మాతలు, పంపిణీదారులు లాహోర్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటి ప్రదర్శన.. 1979 చలనచిత్ర అత్యవసరాదేశానికి విరుద్ధమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. భారతీయ సినిమాలు పాకిస్థానీ యువతపై చెడు ప్రభావాన్ని కలిగించడంతో పాటు పాకిస్థానీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతోందని వారు పేర్కొన్నారు. ఏడాది క్రితం లాహోర్‌ హైకోర్టుకు ఇలాంటిదే ఓ పిటిషన్‌ రాగా కోర్టు దాన్ని కొట్టివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com