మళ్లీ ఎంఎస్ ధోనీకే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు..!
- May 01, 2022
చెన్నై: రవీంద్ర జడేజా సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించినంతగా రాణించడం లేదు.. ఇప్పటివరకు చెన్నై ఎనిమిది మ్యాచ్ లు ఆడగా, కేవలం రెండింటిలో మాత్రమే విజయుం సాధించింది.దీనితో జట్టు యాజమాన్యం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి అప్పగించింది. ''ఆటపై దృష్టిసారించేందుకే రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. అందుకే జట్టును నడిపించాలని ఎంఎస్ ధోనీని కోరాం.నాయకత్వ పగ్గాలను అందుకునేందుకు ఎంఎస్ ధోనీ అంగీకరించాడు.ఇక నుంచి జడేజా తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాడు'' అని జట్టు యాజమాన్యం వెల్లడించింది. కాగా ధోని చెన్నై జట్టుకు ముందునుంచి కెప్టెన్ గా వ్యవహరిస్తూ వచ్చాడు.. ఇప్పటివరకు ఆ జట్టుకు నాలుగు IPL టైటిల్స్ అందించాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







