సింగపూర్ లో ఘనంగా 'మేడే' కార్మిక దినోత్సవ వేడుకలు
- May 01, 2022
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను మే 1, ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు.ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమానికి సుమారు 1,200 మంది స్థానిక తెలుగు కార్మికసోదరులను కలుసుకొని వివిధ డార్మిటరీలలో నివశించే సోదరులను కలుసుకొని వారికి ప్రత్యేకంగా రుచికరంగా తయారు చేయించిన బిర్యాని అందించి కోవిద్ దృష్ట్యా భౌతికంగా రెండుసంవత్సరాల తరువాత కలుసుకొని బాగోగులు తెలుసుకోవటం తో పాటు ముచ్చటించి ఆత్మస్థైర్యాన్ని నింపారు. పూర్వ మరియు ప్రస్తుత కార్యవర్గసభ్యులతో పాటు, సభ్యులు మరియు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ, సింగపూర్ తెలుగు సమాజం తెలుగు కార్మిక సోదరులకి ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉన్నామని, అర్ధరాత్రి అపరాత్రి అనిలేకుండా అన్నివేళళా తనతో పాటు తన కార్యవర్గం ఎప్పుడూ అండగా ఉంటామని మరొక్కసారి భరోసాయిచ్చారు. రెండు సంవత్సరాల తరువాత అందరినీ భౌతికంగా కలుసుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఎటువంటి క్లిష్టపరిస్ధితులోనైనా అందరూ ధైర్యంగా , కలసికట్టుగా ఉంటూ చేతనైనంతలో సాయపడదామని పిలిపునిచ్చారు.
స్ధానిక రెస్టారెంట్స్ సహకారంతో , కుటుంబాలకు దూరంగా ఉన్న సుమారు 1200 మంది కార్మిక సోదరులకు బిర్యాని బాక్స్‌లు అందించామని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు మరియు కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా అన్నివేళలా కార్మికసోదరులకు అండదండగా ఉంటూ, ఈనాటి కార్యక్రమం పర్యవేక్షించి విజయవంతం కావడానికి,మరీ ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్లిష్టకాలంలో సింగపూర్ తెలుగు సమాజం తరుపున సోదరులకు అనేకరకాలుగా సహాయపడుతూ చేదోడువాదోడుగా ఉన్న కార్యవర్గసభ్యులు పోతగాని నరసింహగౌడ్ మరియు నాగరాజుల సేవలను కార్యవర్గసభ్యులు అభినందించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు వారికి మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ, దాతలకు , సహకరించిన రెస్టారెంట్ యాజమాన్యాలకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.





తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!







