అమరావతిలో ఉగాది రోజున బాలకృష్ణ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలు..

- April 05, 2016 , by Maagulf
అమరావతిలో ఉగాది రోజున బాలకృష్ణ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలు..

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ నెల 8న హీరో బాలకృష్ణ తాను నటించబోయే వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను వెల్లడించనున్నారు. అమరావతి (అప్పటి ధాన్య కటకం.. ఇప్పటి ధరణికోట రాజధానిగా చేసుకుని శాతవాహనులు సుధీర్ఘకాలం పరిపాలిం చారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతిగా నామ కరణం చేయడం సర్వజనామోదం పొందింది. శాతవాహన చివరి చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత వృత్తాంతాన్ని ప్రస్తుతం వెండితెరపైకి తీసు కువచ్చి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్నారు. శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా జాతీయ స్థాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన కంచె సినిమా దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్‌ అమరావతిలో తొలిసారి ఆడియో ఫంక్షన్‌ నిర్వహించారు. ఇది ఘన విజ యం సాధించింది. అదే సెంటిమెంట్‌తో ఉగాది పర్వదినం రోజున రాజధాని అమరావతిలో బాలకృష్ణ తన నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాతో శా తవాహనుల చరిత్ర నేటి తరానికి తెలియనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com