విశాఖ: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
- May 05, 2022
విశాఖపట్నం: విశాఖ రుషికొండ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రుషికొండ భూములను పరిశీలించడానికి వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు.హైవేపైనే బాబు కాన్వాయ్‌ను నిలిపివేశారు. బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు.పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రుషికొండ భూములను పరిశీలించాలని భావించారు.
అంతకుముందు సీఎం జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు.ఏపీని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలని టీడీపీ ప్రయత్నిస్తే.. జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ జే బ్రాండ్, గంజాయి, డ్రగ్స్‌కు ఏపీని కేరాఫ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు.
దాదాపు 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు ఎవరు కట్టాలని ప్రశ్నించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు వేశారని పేర్కొన్నారు. జగన్‌ది ఐరన్‌లెగ్ అన్న చంద్రబాబు..అతను ఉన్నంతవరకూ ఏ పరిశ్రమా రాదని కామెంట్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







