భారత్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
- May 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసారు పోలీసులు.తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు ఖలిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఉగ్రవాదుల పన్నాగాన్ని నిఘా వర్గాలు ముందే పసిగట్టాయి. ఆ మేరకు వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలో హరియాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బాంబులు, బుల్లెట్లు, గన్‌పౌడర్ తదితరాలను తరలిస్తుండగా వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గన్ పౌడర్ ఆర్డీఎక్స్ అయి ఉండవచ్చని పేర్కొన్నారు.
ఈ మేరకు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అరెస్టయిన ఉగ్రవాదులను గురుప్రీత్, అమన్ దీప్, భూపేంద్ర, పర్మిందర్ గా గుర్తించారు. వారికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. వారు ఆయుధాలను తెలంగాణ, మహారాష్ట్ర తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు దేశ సరిహద్దులకు ఆవల నుంచి డ్రోన్ల ద్వారా తీసుకువచ్చినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పాకిస్థాన్ లో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది హర్జీందర్ సింగ్ ఈ ఆయుధాలు పంపినట్టు తెలిసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







