దుబాయ్ ఎయిర్ పోర్ట్ రన్ వే మూసివేత: ఫ్లై దుబాయ్ సూచనలు

- May 05, 2022 , by Maagulf
దుబాయ్ ఎయిర్ పోర్ట్ రన్ వే మూసివేత: ఫ్లై దుబాయ్ సూచనలు

దుబాయ్: ఫ్లై దుబాయ్ కొన్ని విమాన సర్వీసుల్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ నుంచి 45 రోజుల పాటు (మే 9 నుండి జూన్ 22 వరకు) నిర్వహించడం జరుగుతుందని పేర్కొంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నార్తరన్ రన్ వే తాత్కాలిక మూసివేత నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 మరియు టెర్మినల్ 3 నుంచి మిగిలిన సర్వీసులు యధాతథంగా కొనసాగుతాయి. ప్రయాణీకులు తమ డిపాచ్యూర్ విషయమై సూచనల్ని తప్పక పాటించాల్సి వుంటుంది. ఫ్లై దుబాయ్ వెబ్‌సైట్‌ https://www.flydubai.com/en/లో మేనేజ్ బుకింగ్ విభాగంలో పూర్తి సమాచారం లభ్యమవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com