'మేజర్' ట్రైలర్..విడుదల చేసిన మహేశ్ బాబు
- May 09, 2022
            హైదరాబాద్: విభిన్నమైన కథలను ఎంచుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. మేజర్ సందీప్ గా అడివి శేష్ నటించాడు అనడం కన్నాజీవించాడు అని చెప్పాలి. దేశం కోసం తల్లిదండ్రులను, భార్యను వదిలి.. తన ప్రాణాలను పణంగా పెట్టిన ఒక సోల్జర్ కథ ఇది.
ఉన్నికృష్ణన్ చిన్నతనం నుంచి అతను దేశం కోసం ప్రాణాలు వదిలేవరకు అన్ని ముఖ్యమైన సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. “నా కొడుకు.. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్.. వెనకడుగేసే అవకాశమే లేదు.. తప్పించుకొనే దారి ఉంది. ముందుకు వెళ్తే చనిపోతాడని తెలుసు.. అయినా వెళ్ళాడు.. చావు కళ్లలోకి చూసి.. నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ.. నా దేశాన్ని కాదు”అంటూ ప్రకాష్ రాజ్ భావోద్వేగంతో చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్క భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తున్నాయి. ఇక ఆ దాడుల్లో చిక్కుకున్న ఒక యువతి లా శోభితా దూళిపాళ్ల కనిపించింది. మొత్తానికి ట్రైలర్ గూస్ బంప్స్ తో పాటు భావోద్వాగానికి గురయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని తెలుగు హిందీ మలయాళ భాషల్లో 2022 జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో శేష్ ఎన్ని రికార్డులు సాదిస్తాడో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







