హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: అవమానాల్ని జయించిన నైట్రో స్టార్
- May 11, 2022‘ఎస్ఎమ్ఎస్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు సుధీర్ బాబు. కృష్ణ అల్లుడు అనే బ్యాక్ గ్రౌండ్‌తోనే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తనంతట తానుగా సినిమా సినిమాకీ, తన టాలెంట్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు సుధీర్ బాబు.
తొలి సినిమాకి చాలా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అసలు హీరోగా పనికి రావన్నారు. గొంతు కూడా బాగా లేదన్నారు. అయినా తన సంకల్పం వదులుకోలేదు. కష్టపడ్డాడు. ఊహించని విధంగా మేకోవర్ సాధించాడు. హీరోగా తనదో డిఫరెంట్ స్టైల్ అని నిరూపించుకున్నాడు.
అలాగే, సుధీర్ బాబు కేవలం హీరో మాత్రమే కాదు, మంచి నటుడు అని చెప్పడం కరెక్ట్‌గా వుంటుందేమో. ఎందుకంటే, కేవలం హీరో పాత్రలే కాదు, నెగిటివ్ రోల్స్‌లోనూ సుధీర్ బాబు మెప్పించగలడు అని నిరూపించుకున్నాడు బాలీవుడ్ మూవీ ‘బాఘీ’ చిత్రంతో.
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రస్తుతం సుధీర్ బాబు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి ఈ సినిమాలో సుధీర్ బాబుతో జత కడుతోంది.
కాగా, సుధీర్ బాబు మరో లేటెస్టు మూవీ ‘మామా మశ్చింద్ర’. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ వదిలింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో సుధీర్ బాబును ‘నైట్రో స్టార్’ అని ప్రస్థావించడం విశేషంగా కనిపిస్తోంది.
ఎన్నో రకాల అవమానాల్ని తట్టుకుని నటుడిగా నిలదొక్కుకున్న నైట్రో స్టార్ సుధీర్ బాబు ఇలాంటి బర్త్‌డేలు ఎన్నోసక్సెస్ఫుల్గా జరుపుకోవాలని, కెరీర్లో మరెన్నో మంచి సినిమాలు చేయాలని ఆశిస్తూ మనం కూడా బర్త్‌డే విషెస్ చెప్పేద్దామా. హ్యాపీ బర్త్‌డే టు యు నైట్రో స్టార్ సుధీర్ బాబు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు