చైనా అధ్యక్షుడికి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి
- May 11, 2022
బీజింగ్ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సెరిబ్రల్ అన్యురిజం అనే వ్యాధితో ఆయన గత ఏడాది ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని, చైనా సంప్రదాయ వైద్య విధానంలోనే చికిత్స చేయించుకున్నారని సమాచారం.
జాతీయ మీడియా కథనాలనుబట్టి జీ జిన్‌పింగ్ సెరిబ్రల్ అన్యురిజం (cerebral aneurysm) వ్యాధికి చైనీస్ సంప్రదాయ చికిత్స పొందారు. శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడలేదు. జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితులపై చాలా కాలం నుంచి ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు విదేశీ నేతలతో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు.
2019 మార్చిలో ఇటలీలో పర్యటించినపుడు ఆయన నడక తీరు అసాధారణంగా కనిపించింది. కాళ్ళు బరువెక్కడం వంటివాటి వల్ల కలిగే బాధతో ఆయన నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో ఫ్రాన్స్ పర్యటనలో కూడా ఆయన కూర్చొనడానికి ఇతరుల సహకారం తీసుకున్నారు. 2020 అక్టోబరులో షెంజెన్‌లో ఆయన ఓ సభకు ఆలస్యంగా హాజరయ్యారు, మాట్లాడుతున్నపుడు విపరీతమైన దగ్గుతో బాధపడ్డారు, చాలా నెమ్మదిగా మాట్లాడారు.
చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సమయంలో జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితిపై కథనాలు ప్రచారమవుతున్నాయి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం, ఉక్రెయిన్ యుద్ధం వల్ల సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం, కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు చాలా కఠినమైన చర్యలను అమలు చేయడం వంటివాటి వల్ల ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది.
ఇదిలావుండగా, ఈ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో మూడోసారి చైనా అధ్యక్షునిగా ఎన్నికవాలని జిన్‌పింగ్ ఆకాంక్షిస్తున్నారు.
సెరిబ్రల్ అన్యురిజం వ్యాధిగ్రస్థుల మెదడులోని రక్త నాళాలు అసాధారణంగా ఉబ్బటం వల్ల రక్త ప్రసరణకు మార్గం సన్నబడుతుంది. రక్త నాళాలు అకస్మాత్తుగా పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం







