షేక్ ఖలీఫా మృతి..వాయిదా పడ్డ ఐఫా (IIFA) అవార్డ్స్
- May 15, 2022
అబుధాబి: దివంగత యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై యూఏఈ అంతటా 40 రోజుల సంతాపదినాలు ప్రటకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అబుధాబి లో జరగాల్సిన IIFA అవార్డుల 22వ ఎడిషన్ వాయిదా వేయాలని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) తన నిర్ణయాన్ని ప్రకటించింది.
మే 20 మరియు 21 తేదీల్లో జరగాల్సిన ఈ అవార్డుల వేడుక ఇప్పుడు జూలై 14, 15 మరియు 16 తేదీల్లో అబుధాబి లో నిర్వహించబడుతుంది అని అధికారిక ప్రకటన వెలువడింది.
అబుధాబి లో వచ్చే వారం జరగాల్సిన కల్చర్ సమ్మిట్ అబుధాబి 2022 యొక్క ఐదవ ఎడిషన్ కూడా వాయిదా పడినట్టు అబుధాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ తెలిపింది.
అబుధాబి నే కాకుండా దుబాయ్, షార్జా మరియు ఇతర ఎమిరేట్స్‌లో కూడా షేక్ ఖలీఫా మృతికి సంతాపసూచికంగా అనేక సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







