షేక్ ఖలీఫా కు నివాళులు అర్పించిన భారత ఉపరాష్ట్రపతి
- May 15, 2022
నూతన అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ తో భేటీ అయిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
అబుధాబి: యూఏఈ దివంగత అధ్యక్షునికి భారత ప్రభుత్వం తరపున నేడు అబుధాబిలో నివాళులు అర్పించారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
యూఏఈ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ను అబుధాబిలోని ముష్రిఫ్ ప్యాలెస్‌లో కలిసి సంతాపం తెలియజేయడంతోపాటు పదవి చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ "భారత్-యూఏఈ మధ్య సత్సంబంధాలకు మరియు యూఏఈ లో నివసిస్తున్న భారతీయుల క్షేమానికి షేక్ ఖలీఫా చూపిన చొరవ మరువరానిది.భారత్ కు యూఏఈ ఎంతో సన్నిహిత మిత్రుడు" అని ఖలీఫా తో ఆయనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు.
షేక్ మొహమ్మద్ నేతృత్వంలో భారత్-యూఏఈ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు భారత్ ఉపరాష్ట్రపతి.
ఉపరాష్ట్రపతి తోపాటు యూఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్, ఉపరాష్ట్రపతి సెక్రటరీ డా.ఐ.వి సుబ్బా రావు, జాయింట్ సెక్రటరీ (గల్ఫ్) విపుల్ మరియు ఇతర భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉన్నారు.
ఇక, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







