ప్రవాసుల వైద్య పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఆరోగ్య మంత్రి
- May 16, 2022
కువైట్: షువైఖ్‌లోని ప్రవాస వైద్య పరీక్షా కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ సందర్శించారు. ఈ సందర్భంగా సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రం సామర్థ్యం, సేవల నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ సూచనలను ఆయన చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా మంత్రితో పాటు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెడా, పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ ముహమ్మద్ అల్-సయీదాన్ ఉన్నారు. ఆదివారం నుండి గురువారం వరకు గృహ కార్మికులకు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు (కువైట్ స్పాన్సర్‌తో పాటు), మధ్యాహ్నం 1 నుండి 7 గంటల వరకు మిగిలిన ప్రవాస కార్మికులకు స్లాట్లు కేటాయించాలని ఆదేశించారు. అలాగే శనివారం గృహ సహాయకుల కోసం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు (కువైట్ స్పాన్సర్‌తో పాటు) కేటాయించాలని సూచించారు. రద్దీని నివారించడానికి, ముందస్తు రిజర్వేషన్ ప్రకారం నిర్దేశించిన తేదీలలో పరీక్షా కేంద్రాలకు రావాలని సందర్శకులకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







