సమంత విజయ్ దేవరకొండ: రొమాంటిక్ ‘అణుబాంబు’ కథేంటబ్బా.!
- May 16, 2022
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లేటెస్టుగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌ని ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టడం ఒకింత ఇంట్రెస్టింగ్‌గా వుంది. టైటిల్‌ని బట్టి సినిమాకి రొమాంటిక్ అప్పీల్ రానే వచ్చిందనుకోండి. అయితే ఇక్కడ విషయం అది కాదు, ఫస్ట్ లుక్ పోస్టర్. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ పోస్టర్‌లో ఏముందంటే, విజయ్ దేవరకొండకీ, సమంతకీ పెళ్లిలో కొంగు ముడి పెట్టినట్టుగా ముడి పెట్టేశారు. ఈ ముడికి అర్ధం ఏంటీ.? అనేదే ప్రేక్షకుల్లో మెదులుతున్న క్యూరియాసిటీ. బ్యాక్ గ్రౌండ్‌లో పింక్ కలర్‌లో అణు విస్ఫోటనం. మన హీరో, హీరోయిన్లు మాత్రం సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నారనుకోండి. ఒకింత అమాయకత్వం కూడా వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అంతా బాగానే వుంది కానీ, సమంత, విజయ్ దేవరకొండ మధ్య ఆ ‘కొంగు‘ముడి’ ఇప్పుడు రచ్చకు దారి తీసింది. అక్కినేని అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. అదేంటీ. అక్కినేని అభిమానులకొచ్చిన చిక్కేంటీ.? అనుకుంటున్నారా.?
ఏమో, ఈ మధ్యనే అక్కినేని ఫ్యామిలీ నుంచి రాజీనామా పుచ్చుకుంది కదా సమంత అందుకేమో. అదేనండీ చైతూ నుండి విడాకులు తీసుకుని, అక్కినేని ఫ్యామిలీకి కోడలిగా గుడ్ బై చెప్పేసింది కదా.. అది. అయినా ఇది సినిమా. అది పర్సనల్. ఈ రెండింటికి ‘ముడి’ పెట్టడం ఏమైనా బాగుందా చెప్పండి.
తాజా వార్తలు
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







