పాపం కరాటే కళ్యాణి: అనుకున్నదొక్కటి అయ్యింది ఇంకొక్కటి.!
- May 16, 2022
అదేమైనా నోరా.. తాటి మట్టా.? అనడం వింటుంటాం కదా. అవును, వెనకా ముందూ చూడకుండా, నోటి కొచ్చిందల్లా మాట్లాడేవాళ్ల విషయంలో ఈ మాట తరచూ వాడటం తెలిసిందే. ఆ మాటను నటి కరాటే కళ్యాణి విషయంలోనూ కొందరు బాగానే వాడేస్తుంటారనుకోండి. అందుకు కారణం ఆమె నోరే.
అది సరే, ఇప్పుడా నోటికి వచ్చిన చిక్కేంటో.? అనుకుంటున్నారా.? ఓ యూ ట్యూబర్‌పై నోటి వాటమే కాదు, కాస్త చేతి వాటం కూడా ప్రయోగించిన గొడవలో కళ్యాణి ఈ మధ్య రచ్చకెక్కిన ముచ్చట ఇప్పుడు వైరల్ అయ్యింది మరి.
ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, అమ్మో.! కరాటే కళ్యాణితో పెట్టుకుంటే ఇంకేమైనా వుందా.? అమ్మాయిలపై అసభ్యకరమైన ప్రాంక్ వీడియోలు తీస్తున్నాడంటూ ఓ యూ ట్యూబర్‌పై ఆరోపణలు చేస్తూ, అతని ఇంటికి వెళ్లి చితకబాదుడు బాదేసింది కరాటే కళ్యాణి.
ఆ యూ ట్యూబర్ (పేరు శ్రీకాంత్ రెడ్డి) కూడా తక్కువేం తీనలేదనుకోండి. కళ్యాణిపై కూడా చేయి చేసుకున్నాడట. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లి, ఇరువురిపై కేసులు నమోదయ్యేదాకా చేరింది. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ, కరాటే కళ్యాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.
కట్ చేస్తే, ఆమెపై చిన్న పిల్లల కిడ్నాప్ ఆరోపణ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యనే ఓ చిన్నపిల్లను కరాటే కళ్యాణి దత్తత తీసుకుందన్న వార్త మీడియాలో వినిపించింది. అయితే, తాజా ఇష్యూలో తేలిందేంటంటే, ఆ దత్తతకు సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాల్లేవని అంటున్నారు. పాపం కళ్యాణి ఏదో అనుకుంటే, ఇంకేదో అయ్యింది మరి.
తాజా వార్తలు
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!







