గ్రీన్కో ప్రాజెక్టుకు ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన
- May 17, 2022
అమరావతి: కర్నూలు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు.. ఓర్వగల్లు మండలం గుమ్మితం తండాలో సీఎం జగన్ అంకురార్పణ చేశారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం.. కాంక్రీట్ వేసి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించారు. గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. 4వేల 766 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 5 వేల 410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇక ఒకే యూనిట్ నుంచి సోలార్, పవన, జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. సోలార్ ద్వారా 3వేల మెగావాట్లు, విండ్ 5050 మెగావాట్లు, హైడల్ పవర్ 1860 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్ కో గ్రూప్ సంస్థ 3 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







