ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చిన కువైట్
- May 18, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రభుత్వం ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఎవరైతే సెలవులు వినియోగించుకోలేదో వారికి ఈ ఆఫర్.ఉద్యోగులు వాడుకోకుండా అలాగే మిగిలిపోయిన సెలవుల్ని డబ్బు గా మార్చుకునే అవకాశం కల్పించింది. అంటే.. ఎన్ని ఎక్కువ లీవ్స్ ఉంటే అంత డబ్బు అన్నమాట.దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు మిగిలిపోయిన తమ సెలవుల్ని డబ్బు గా మార్చుకునేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీనికోసం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది.
సివిల్ ఐడీ నంబర్‌తో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు సమయంలో కావాల్సిన వివరాలతో పాటు మిగిలిపోయిన సెలవులు ఎన్ని ఉన్నాయో ఎంటర్ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగి సెలవుల వివరాలను ఆడిట్ విభాగం ద్వారా నిర్ధారించుకున్న తర్వాత వాటి తాలూకు నగదును ఆ ఉద్యోగి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 15వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూన్ 30 వరకు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్‌లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం







