ఈ నెల 21 వరకు తెలంగాణకు వర్ష సూచన
- May 18, 2022
హైదరాబాద్ : తెలంగాణలో ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఉత్తర-దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని తెలిపింది.
మరోవైపు తెలంగాణలోని 20 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైన, 5 జిల్లాల్లో 38 డిగ్రీలకు పైన, 3 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న రాత్రి అతి తక్కువగా మెదక్ జిల్లా కల్లకల్ లో 23.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో నిన్న 2.56 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







