యూఏఈలోని భారతీయ విద్యార్థులు, విదేశీయులు ఎన్ఐటి, ఐఐటీల్లో 15 శాతం సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు
- May 18, 2022
యూఏఈ: యూఏఈలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు, భారతదేశంలోని ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌లో 15 శాతం కోటాకి దరఖాస్తు చేసుకోవచ్చు. భారత విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ కేటగిరీలో 2022-2 శాతానికిగాను ఈ కోటా పేర్కొన్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ - మెయిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 15 శాతం సీట్లు నిట్ మరియు ఐఐటిలలో ఈ కోటా కింద పొందే వీలుంది. సుమారుగా వీటి మొత్తం సంఖ్య 5000 వరకూ వుండొచ్చు. 3900 అండర్ గ్రాడ్యుయేట్, 1,300 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఈ స్కీమ్ ద్వారా భర్తీ చేయబడతాయి. దాసా స్కీమ్ కింద అప్లికేషన్ ఫీజు 300 డాలర్లు కాగా, ట్యూషన్ ఫీజు 8,000 డాలర్లు. భారత సంతతి విద్యార్థులకు 1,25,000 రూపాయల ట్యూషన్ ఫీజు వుంటుంది. దాసా స్కీమ్‌లో కేవలం విదేశీ జాతీయులు ఏ దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా దరఖాస్తు చేసుకోవచ్చు. 300 జిఆర్ఇ స్కోర్ కనీసం సంపాదించాల్సి వుంటుంది. 300 డాలర్లు నాన్ రిఫండబుల్ పీజు, 4,000 డాలర్లు తొలి సెమిస్టర్ ఫీజు వుంటుంది.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







