ఖతారీల కోసం మరో నాలుగు ఆరోగ్య కేంద్రాలు
- May 19, 2022
ఖతార్: ఖతారీల కోసం జూన్ 15, 2022 నాటికి మరో నాలుగు ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని పబ్లిక్ హెల్త్ మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. ఖతారీలకు మాత్రమే కేటాయించబడిన ఆరోగ్య కేంద్రాలు.. 1- లీబైబ్ ఆరోగ్య కేంద్రం, 2- ముయిథర్ హెల్త్ సెంటర్, 3- అల్ తుమామా ఆరోగ్య కేంద్రం, 4- దక్షిణ అల్ వక్రా ఆరోగ్య కేంద్రం. ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్‌లోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఖతారీస్కు ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే నిర్మాణంలో ఉన్న కొత్త ఆరోగ్య కేంద్రాలు ఖతార్లకు కేటాయించబడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇవి 2023 మొదటి త్రైమాసికంలో పూర్తవుతాయని పేర్కొంది. ప్రస్తుతం 1- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్, 2- అల్ సద్ ఆరోగ్య కేంద్రం, 3- ఉమ్మ్ సనీమ్ హెల్త్ సెంటర్, 4- కొత్త అల్ ఖోర్ హెల్త్ సెంటర్ లు నిర్మాణం తుది దశలో ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే దేశంలోని ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్‌తో అనుబంధంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల సంఖ్య 28 ఆరోగ్య కేంద్రాలకు చేరుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







