మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ ప్రభుత్వం ఆంక్షలు..

- May 20, 2022 , by Maagulf
మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ ప్రభుత్వం ఆంక్షలు..

కాబుల్: అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబాన్ స‌ర్కార్ మ‌హిళ‌ల విష‌యంలో మ‌రిన్ని ఆంక్షలు విధించింది. మ‌హిళ‌లు బ‌హిరంగ ప్రదేశాల్లో త‌మ ముఖాల‌ను క‌ప్పుకోవాలని కొద్దిరోజుల క్రితమే ఆదేశాలిచ్చిన తాలిబాన్ ప్రభుత్వం… అదే ర‌క‌మైన ఆదేశాల‌ను మహిళా జర్నలిస్టులకు కూడా చేసింది. న్యూస్ రీడర్‌ న్యూస్ చ‌దువుతున్న స‌మ‌యంలో త‌మ మొఖాలు క‌నిపించ‌కుండా క‌ప్పుకోవాల‌ని ఆదేశించింది.

మీడియా సంస్థలు క‌చ్చితంగా ఈ విష‌యాన్ని త‌ప్పకుండా పాటించాల‌ని హుకుం జారీచేసింది. రేపటివరకు వెసులుబాటు వుంటుంద‌ని, ఆ త‌ర్వాత ఈ ప్రతిపాద‌న‌ను క‌చ్చితంగా అమలు చేయాల‌ని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై మ‌హిళ‌ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమ‌వుతోంది. గతంలోనూ తాలిబన్‌ల పాలనలో ఇలాంటి అరాచకాలనే ఎదుర్కొన్నారు అక్కడి మహిలు. అయితే మధ్యలో ప్రజాప్రభుత్వం ఏర్పడడంతో స్వేచ్ఛగా బతికారు. ఇప్పుడు మళ్లీ కఠిన పరిస్థితుల్లో గడుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com