ఫాఫం.! జీవిత రాజశేఖర్ అలా బుక్కయిపోయారే.!
- May 20, 2022
సందు దొరికితే చాలు మెగా ఫ్యామిలీ మీద అవాకులు చవాకులు పేలేసే జీవితా రాజశేఖర్ అడ్డంగా దొరికిపోయారు. తాజాగా ‘శేఖర్’ సినిమా రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా నోరు జారి అబాసు పాలయ్యారు జీవిత. క్యాజువల్‌గా మాట్లాడుకునే మాటే అయినా, మనోభావాలు దెబ్బ తినేలా ఆమె మాట తీరు వుందంటూ ఓ వర్గం, జీవితను ఆడి పోసుకుంటున్నారు.
ఇంతకీ జీవిత నోరు జారిన ఆ మాట ఏంటో.? అనేగా మీ అనుమానం. కూతురి పిసినారితనాన్ని వుద్దేశించి.. కోమటి వాళ్లని నోట్లో నానేలా చేసింది. దాంతో ఆ వర్గం వారికి ఎక్కడ లేని కోపం చిర్రెత్తుకొచ్చింది. ఊరుకుంటారా.? నెట్టింట్లో రచ్చ మొదలెట్టేశారు.
చివరికి, తన టంగ్ స్లిప్సింగ్కి జీవిత సారీ చెప్పక తప్పలేదు. ఉత్తిగా సారీ చెబితే జీవిత ఎందుకవుతుంది.? సెలబ్రిటీల మాటల్ని వంకర బుద్ధితో మార్చేస్తూ, ముఖ్యంగా తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారనీ, అలాంటి వారిని గట్టిగా శిక్షించాలనీ చెప్పింది.
తనదాకా వస్తే కానీ, తలనొప్పి తెలీదు.. అంటారు. ఎదుటి వారి జీవితంలోకి అనవసరంగా తొంగి చూసి, వారి జీవితాల్ని రోడ్డున పడేసినప్పుడు తానూ సాటి సెలబ్రిటీనని సదరు జీవితగారికి గుర్తు రాలేదు కాబోలు.. అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా వుంటే, సందట్లో సడేమియా అన్నట్లుగా చెక్ బౌన్స్ కేసు వివాదమొకటి తాజాగా జీవిత రాజశేఖర్ మెడకు ఒకింత గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తోంది.
కాగా, రాజశేఖర్ లీడ్ రోల్ పోషించిన ‘శేఖర్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







