ఎన్టీయార్‌తో కళ్యాణ్ ‌రామ్ రెండోస్సారి

- May 20, 2022 , by Maagulf
ఎన్టీయార్‌తో కళ్యాణ్ ‌రామ్ రెండోస్సారి

బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీయార్. అందులో ఒకటి కొరటాల శివ సినిమా కాగా, ఇంకోటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

 కాగా, ఈ రెండు సినిమాలపైనా భారీ అంచనాలున్నాయ్. లేటెస్టుగా రిలీలైజైన ఈ రెండు సినిమాల పోస్టర్లూ భారీ అంచనాలు క్రియేట్ చేసేలా వుండడం విశేషం.
 
‘కేజీఎఫ్’ తో  కన్నడ సినిమా ఖ్యాతిని పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సారి ఎన్టీయార్‌తో పెద్ద సెన్సేషన్‌కి ట్రాక్ సెట్ చేస్తున్నట్లుగా వుంది ఫస్ట్ లుక్ పోస్టర్. పక్కా మాస్ ఎలివేటెడ్ పోస్టర్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌ని షాక్‌కి గురి చేశాడు ప్రశాంత్ నీల్.
 
మరోవైపు కొరటాల కూడా తక్కువ తినలేదు. అసలే ‘ఆచార్య’ ఫ్లాప్ టేస్ట్ చేసి వున్నాడేమో. యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమాపై మొదట్నుంచీ చాలా జాగ్రత్తగా వుండబోతున్నాడట. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే ఆ కేరింగ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
 
కాగా, ఈ రెండు సినిమాలూ ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలే కావడం ఓ విశేషం అయితే, ఈ రెండు సినిమాలకు కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండడం మరో విశేషం. గతంలో కళ్యాణ్ రామ్ బ్యానర్ నుంచి వచ్చిన ‘జై లవ కుశ’ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

యువ సుధ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా రూపొందుతోంది ఎన్టీయార్ 30. ఈ సినిమాకే కొరటాల దర్శకుడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌తో కలిసి ఎన్టీయార్ 31ని రూపొందిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకుడు. కొరటాల సినిమా పూర్తయ్యాకనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com