గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్...
- May 20, 2022
ముంబై: ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాల్లోకి ఎగిరిన నిముషాల వ్యవధిలోనే విమానంలో తలెత్తిన సాంకేతికత సమస్య కారణంగా విమానం ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో దించేశారు. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో వివరాలు ఇలా ఉన్నాయి.టాటా గ్రూప్ నాకు చెందిన ఎయిర్ ఇండియా ఏ320 నియో విమానం శుక్రవారం ఉదయం 9:43కి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో బయలుదేరింది. విమానం టేక్ ఆఫ్ అయిన 20 నిముషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా ఒక ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది.
ఇది గమనించిన పైలట్లు, వెంటనే విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంకు మళ్లిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో కొంత భయాందోళనకు గురైన ప్రయాణికులు..విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ మరియు మెయింటెనెన్స్ నిపుణుల ఆధ్వర్యంలో సమస్య కారణాలు అన్వేషిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ అధికారులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







