గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్...

- May 20, 2022 , by Maagulf
గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్...

ముంబై: ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాల్లోకి ఎగిరిన నిముషాల వ్యవధిలోనే విమానంలో తలెత్తిన సాంకేతికత సమస్య కారణంగా విమానం ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో దించేశారు. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో వివరాలు ఇలా ఉన్నాయి.టాటా గ్రూప్ నాకు చెందిన ఎయిర్ ఇండియా ఏ320 నియో విమానం శుక్రవారం ఉదయం 9:43కి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో బయలుదేరింది. విమానం టేక్ ఆఫ్ అయిన 20 నిముషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా ఒక ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది.

ఇది గమనించిన పైలట్లు, వెంటనే విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంకు మళ్లిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో కొంత భయాందోళనకు గురైన ప్రయాణికులు..విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ మరియు మెయింటెనెన్స్ నిపుణుల ఆధ్వర్యంలో సమస్య కారణాలు అన్వేషిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ అధికారులు విచారణ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com