జూన్ నుండి బహిరంగ ప్రదేశాల్లో పని బంద్: కార్మిక మంత్రిత్వ శాఖ
- May 23, 2022
మస్కట్: జూన్ నుండి ఆగస్టు వరకు మధ్యాహ్న సమయాలలో నిర్మాణ స్థలాలు, బహిరంగ ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధించే నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కార్మిక మంత్రిత్వ శాఖలో కార్మిక శాఖ అండర్ సెక్రటరీ షేక్ నస్ర్ బిన్ అమెర్ అల్ హోస్నీ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరంలో వేసవి కాల ప్రచారాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు నిషేధిత గంటలలో పనిని నిలిపివేసే ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ కొనసాగిస్తుందని తెలిపారు. జూన్, జూలై, ఆగస్ట్‌లలో బహిరంగ ప్రదేశాలలో కార్మికులు ఎండ దెబ్బకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. మానవ అభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం ఒమన్ సుల్తానేట్‌లో కార్మికుల భద్రత, వృత్తిపరమైన ఆరోగ్యంపై కార్మిక మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







