ఖతార్‌లో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు: మంత్రిత్వ శాఖ

- May 23, 2022 , by Maagulf
ఖతార్‌లో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు: మంత్రిత్వ శాఖ

దోహా: ఖతార్ లో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసు నమోదు కాలేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) తెలిపింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ఏవైనా అనుమానిత కేసులు కనిపిస్తే వాటిని ముందస్తుగా గుర్తించేందుకు పూర్తి స్థాయి ప్రజారోగ్య చర్యలను తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య అధికారులకు నివేదించాలని ప్రజలకు సూచించింది. అలాగే మంకీపాక్స్ లక్షణాలతో వచ్చే వారికి సేవలు అందించాలని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మే 13 నుండి ఇప్పటి వరకు కనీసం 12 దేశాల్లో మంకీపాక్స్ కేసులను గుర్తించారు. అయితే ఆ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు. మంకీపాక్స్ అనేది పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే వైరల్ ఇన్ఫెక్షన్. అప్పుడప్పుడు ఇది ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా జ్వరం, కండరాల నొప్పులు,  కణుపుల వాపు(వాటర్ బబుల్స్) లక్షణాలను కలిగి ఉంటుంది. చికెన్‌పాక్స్ లాంటి దద్దుర్లు చేతులు, ముఖంపై కనిపిస్తాయని నిపుణులు చెబతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com