ఉద్యోగికి 30-రోజుల పూర్తి వేతనంతో సిక్ లీవ్స్: మంత్రిత్వ శాఖ
- May 24, 2022
రియాద్ : ఉద్యోగులు మొదటి 30 రోజుల వ్యవధిలో పూర్తి వేతనంతో అనారోగ్య సెలవులకు(సిక్ లీవ్స్) అర్హులని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) తెలిపింది. తదుపరి 60 రోజుల సిక్ లీవ్‌కు మూడు వంతుల వేతనాన్ని కలిగి ఉంటాడు. ఒక సంవత్సరం వ్యవధిలో తదుపరి 30 రోజుల పాటు వేతనం లేకుండానే సెలవు తీసుకోవచ్చు. కార్మిక చట్టం ప్రకారం.. అనారోగ్య సెలవుల గడువు ముగిసేలోపు, అనారోగ్యం కారణంగా కార్మికుల ఉద్యోగ ఒప్పందం రద్దు కాదని మంత్రిత్వ శాఖ చెప్పింది. కార్మికుడికి తన వార్షిక సిక్ లీవ్ స్లిప్ కోసం అభ్యర్థించడానికి హక్కు ఉందని పేర్కొంది. ఉద్యోగి తన డ్యూటీ సమయంలో ప్రమాదంలో గాయపడి తాత్కాలిక వైకల్యానికి గురైతే, అతను 60 రోజుల వ్యవధిలో తన పూర్తి వేతనానికి సమానమైన ఆర్థిక సహాయానికి అర్హులని, ఆపై 75 శాతానికి సమానమైన ఆర్థిక పరిహారానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది. చికిత్స వ్యవధి ఒక సంవత్సరానికి చేరుకుంటే, లేదా కార్మికుడు కోలుకునే అవకాశం లేదని వైద్యపరంగా నిర్ధారించబడినట్లయితే పూర్తి వైకల్యంగా పరిగణించబడుతుందని, తదనుగుణంగా పని ఒప్పందం రద్దు చేసి పరిహారం చెల్లించబడుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







