ఇరాన్ అధ్యక్షుడికి ఒమానీ ఖడ్గాన్ని బహుకరించిన సుల్తాన్

- May 24, 2022 , by Maagulf
ఇరాన్ అధ్యక్షుడికి ఒమానీ ఖడ్గాన్ని బహుకరించిన సుల్తాన్

మస్కట్:  ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ ఇబ్రహీం రైసీ ఒమన్ సుల్తానేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్‌లో  సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక లంచ్ భేటీని ఏర్పాటు చేశారు. అంతకు ముందు హిజ్ మెజెస్టి ది సుల్తాన్ ఇరాన్ అధ్యక్షుడికి స్మారక బహుమతిగా ఒమానీ ఖడ్గాన్ని బహుకరించారు. ఈ లంచ్ భేటీలో  రాజ కుటుంబ సభ్యులు, మంత్రులు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ చైర్మన్లు, సుల్తాన్ సాయుధ దళాలు, రాయల్ ఒమన్ పోలీసు కమాండర్లు, అలాగే అరబ్  స్నేహపూర్వక దేశాల రాయబారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com