యంగ్ హీరో రిస్క్ ఫలిస్తుందా.?
- May 24, 2022
సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే తేడాల్లేవ్. ‘బాహుబలి’ దెబ్బకి ఆ విభజన ఎప్పుడో పోయింది. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు ఆ లెగసీని అలా అలా కంటిన్యూ చేసి, సౌత్ సినిమా స్థాయిని పెంచేశారు.
పెంచేయడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా అనే ట్యాగ్ ఫిక్స్ అయ్యేలా చేశారు. అందుకే రీసెంట్‌గా ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నోటి వెంట కూడా ఇదే మాట వచ్చింది. ‘ఇండియన్ సినిమా’, ‘హిందుస్థానీ సినిమా’ అని ఆయన వ్యాఖ్యానించడం నిజంగా విశేషమే.
సరే, ఇదే నేపథ్యంలో చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేదు. కంటెంట్ బాగుంటే చాలు.. ప్యాన్ ఇండియా ఆలోచనలు చేస్తున్నారు. లేటెస్టుగా యంగ్ హీరో నిఖిల్ కూడా ఇదే బాటలో ప్రయాణించాలనుకుంటున్నాడు. నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ సినిమాకి ప్యాన్ ఇండియా మెరుగులు దిద్దే యోచనలో వున్నారట.
ఆ క్రమంలోనే హిందీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారట. హిందీ డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంటానంటున్నాడు నిఖిల్. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో, బాలీవుడ్ ఆడియన్స్‌నీ ఎట్రాక్ట్ చేయగలదని నమ్ముతున్నారు.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందింది ఈ సినిమా. జూలై 22న రిలీజ్‌కి సిద్ధమవుతోంది. చూడాలి మరి, నిఖిల్ చేస్తున్న ఈ పెద్ద రిస్క్ ఫలిస్తుందో.? లేదో.?
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







