అబుధాబి పేలుడు: భారత వలసదారుడు సహా ఇద్దరు మృతి

- May 24, 2022 , by Maagulf
అబుధాబి పేలుడు: భారత వలసదారుడు సహా ఇద్దరు మృతి

యూఏఈ: అబుధాబి నగరంలోని ఓ రెస్టారెంటులో గ్యాప్ సిలెండర్ పేలుడు సంభవించిన ఘటనలో ఓ భారతీయ వలసదారుడు సహా మొత్తం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అబుధాబి లోని భారత ఎంబసీ ఈ ఘటనపై స్పందిస్తూ, భారత వలసదారుడు మృతి చెందిన విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. జరిగిన ఘటన దురదృష్టకరమని ఎంబసీ వెల్లడించింది. ఖలీదియా మాల్ మరియు షైనింగ్ టవర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు భవనాలు కూడా దెబ్బతిన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com