యూఏఈలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
- May 24, 2022
అబుధాబి: యూఏఈలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయిందని ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికా నుండి వచ్చిన 29 ఏళ్ల మహిళలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించామని, వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి..అవసరమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు యూఏఈ వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు అత్యున్నత నిర్ధారణ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు, వ్యాధిని నిర్ధారించడానికి ఎపిడెమియోలాజికల్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంకీపాక్స్ కేసుల విషయంలో పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని ప్రజలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







