ఈ నెల 29న రెండు వాక్ ఇన్ పాస్పోర్ట్ శిబిరాలను ఏర్పాటు చేయనున్న ఇండియన్ కాన్సులేట్
- May 26, 2022
దుబాయ్: ఈ నెల 29న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్, నార్తర్న్ లో ఉన్న ఆరు బీఎల్ఎస్(BLS) ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్లలో వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉదయం 10 గంగల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పాస్పోర్ట్ లు, వీసా సమస్యలను పరిష్కరించనున్నారు. దరఖాస్తుదారులు ఆన్లైన్ పూరించిన దరఖాస్తును BLS కేంద్రాలలో సమర్పించవచ్చు. అపాయింట్మెంట్ లేకుండా.. మొదట వచ్చిన వారికి ప్రధాన్యత ఇవ్వబడుతుంది. 31.08.2022 నాటికి పాస్పోర్ట్ ల గడువు ముగుస్తున్న వారు, అత్యవసర కేసులు (వైద్య చికిత్స, మరణం), అత్యవసర పాస్పోర్ట్ పునరుద్ధరణ, గడువు ముగిసిన లేదా రద్దు చేయబడిన వీసాను తిరిగి ముద్రించడానికి(కొత్త ఉద్యోగం కోసం వీసా), రాబోయే వారాల్లో విదేశాలకు/భారతదేశానికి ప్రయాణించేవారు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు/ అవుట్ పాస్, పాస్పోర్ట్ లు పోయిన/పాడైనవి, NRI సర్టిఫికెట్లు (విద్యాపరమైన ప్రయోజనం కోసం), భారతదేశంలో ప్రవేశ ప్రయోజనాల కోసం లేదా దరఖాస్తు కోసం ప్రయాణించే విద్యార్థులకు పాస్పోర్ట్ పునరుద్ధరణ వంటి సేవలను అందించనున్నారు. అల్ ఖలీజ్ సెంటర్, దీరా సిటీ సెంటర్, ప్రీమియం లాంజ్ సెంటర్, షార్జా HSBC సెంటర్, ఇండియన్ అసోసియేషన్ షార్జా BLS కేంద్రాలలో దరఖాస్తును సమర్పించవచ్చు. ఏవైనా ప్రశ్నలు/ఫీడ్బ్యాక్ కోసం ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రం (PBSK) టోల్-ఫ్రీ నంబర్: 80046342 లేదా [email protected] ; [email protected] లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







