ఖతార్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం
- May 26, 2022
దోహా: దేశంలో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నియంత్రిస్తూ మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా నిర్ణయాన్ని ఖతార్ క్యాబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అమిరి దివాన్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే ఖతార్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య దౌత్య, ప్రత్యేక, అధికారిక పాస్‌పోర్ట్ లను కలిగి ఉన్నవారికి వీసా అవసరాలను రద్దు చేసే ముసాయిదా ఒప్పందాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. సంస్థలు, కంపెనీలు, షాపింగ్ కేంద్రాలు అన్ని రకాల ఉత్పత్తులను, వస్తువులను ప్యాకేజింగ్, ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, తీసుకువెళ్లడం లేదా రవాణా చేయడంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగించడం నిషేధించారు. వాటి స్థానంలో బహుళ వినియోగ ప్లాస్టిక్ సంచులు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులు, కాగితం లేదా "నేసిన" సంచులు, ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లతో చేసిన వాటిని ఉపయోగించాలని ముసాయిదా తీర్మానంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







