రామానాయుడి బయోపిక్ ఆలోచనలో వెంకటేష్.?
- May 26, 2022
సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తెరకెక్కించాల్సి వస్తే, అందులో మహేష్ బాబు నటిస్తాడా.? అని అడిగితే. మహేష్ నో అని సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే ఈ మధ్య. అయితే, దగ్గుబాటి పెద్దాయన రామానాయుడు బయోపిక్ కనుక తెరకెక్కించాల్సి వస్తే, అందులో నటించడానికి నేను సిద్ధమే అంటున్నాడు ఆయన తనయుడు విక్టరీ వెంకటేష్.
అయితే, షరతులు వర్తిస్తాయంటున్నారాయన. రామానాయుడి జీవిత గాథకు సంబంధించిన కథ తనను ఇంప్రెస్ చేస్తేనే అందులో నటించడానికి తాను రెడీ అంటున్నాడు విక్టరీ వెంకటేష్. బయోపిక్స్ అంటే అంత ఆషా మాషీ కాదండోయ్.
భారీ అంచనాలతో తెరకెక్కిన ‘ఎన్టీయార్ బయోపిక్’ ఏమైందో తెలిసిందే కదా. అన్ని బయోపిక్స్ వర్కువువట్ కావంతే. వర్కవుట్ అయితే ఫర్వాలేదు కానీ, ఫలితం కాస్త అటూ ఇటూ అయినా కష్టమే. ఆ పెద్దోళ్ల మహోన్నత వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చినట్టే అవుతుంది బయోపిక్స్ సాహసాలతో. అందుకే మహేష్ బాబు సింపుల్గా ఆ సాహసం నేను చేయలేనని తేల్చేశారు.
సరే, ఆ సంగతి అటుంచితే, కథల ఎంపికలో వెంకటేష్ రూటే సెపరేటు.తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ, సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా తన ఉనికిని చాటుకుంటున్నారు. లేటెస్టుగా ‘ఎఫ్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు. వెంకీతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







